మా ఊళ్లే, పల్లెల పొంటి జీపులు, ఆటోలు ఆ ఊర్నుంచేల్లి ఈ ఊరుకు ఒకటే నడుస్తుండే!! జయితాల (జగిత్యాల)నుంచి పూడూరు, మల్ల పూడూరు నుంచి జయితాల(జగిత్యాల) అట్నుంచి ఇటూ ఇట్నుంచి అటూ ఒక్కటే తిరుగుడు - దీన్ని ”అడి” గొట్టుడు అంటుంటుమి!!
ఇప్పుడు కొండా సురేఖ గూడ ”అడి” గొడ్తున్నట్టుంది .మొదాలు ”స్కామ్ గ్రెస్సుల” ఎలుగవెట్టింది తర్వాత వైస్సార్ పార్టీ అన్నది ( ”ఆయన వచ్ఛే”” పార్టీ) ఇగ తర్వాత జగనన్న దగ్గర పప్పులుడకకపోతే గులాబీ జెండా వట్టింది-గాపార్టీ ల ”మంచి మంచోళ్ళే మట్టాన వొంగా” ఇగ గీమే ఆటలేం సాగుతలే!!! ఇగ సురేకవ్వ ”అడి” గొడ్తాంది - మల్ల ”స్కామ్ గ్రెస్సు” ల కు జంప్ జిలాని అయితున్నట్టు గోడ్తుంది!! అక్క కు పదవి, టిక్కెట్టు గివ్వే గావాలె. తనకు, మొగడికి, బిడ్డకు అందరికి టిక్కెట్లు గావాల్నట - ఇక్కడ ఒక్కనికే దిక్కు లేదంటే, ఈళ్ళకు ఇంట్ల అందరికీ టిక్కెట్లు గావాల్నట..
అక్క, బావ - ఇద్దరు రాజకీయ దిగజారుడు తనానికి మచ్చుతునకలు!! ఎవడు పదవి ఇస్తే అక్కడికే వోతారు.. ఇగ ఇప్పుడు బిడ్డ గూడా జేరింది!!
”స్కామ్ గ్రెస్సు”- వైస్సార్ ”స్కామ్ గ్రెస్సు”-తెరాస-””స్కామ్ గ్రెస్సు”.......అక్క ”అడి” గొడ్తాంది
”అడి” గొట్టుడు అక్కకు తెలిసినంత వోళ్లకు తెల్వది
No comments:
Post a Comment