Friday, September 7, 2018

నేను రాసిన నలభైల్లో మరి కొన్ని నిజాలు

నలభైల్లో నిజాలు అని మా ఫ్రెండొకడు ఫేసు బుక్కులో నాలుగు లైనులు వాక్రుచ్చితే నాకు రాయాలనిపించింది .

నేను రాసిన నలభైల్లో మరి కొన్ని నిజాలు————————————————-

ఉద్యోగం పురుష లక్షణం , వర్క్ ఈజ్ వర్షిప్ ఈ ఉవాచలన్నిటి పుణ్యమా అని కార్పొరేటు బానిసలం ఎప్పుడయ్యామో గుర్తే లేదు 

“వర్కులైఫు బాలన్స్ “అనే ఎండమావి వెనుక పరుగెడుతూనే ఉన్నాము

“మిడ్ లైఫు క్రైసిస్” తరుముతుంటే జవాబు లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాము

తెల్లోడి గులాములై మనతాతలు బతికారు మరి వారికి వేరే అవకాశం లేదు. తెల్లోడికి తాఖీదని మనకై మనమే గులాములయినాము

కడుపు కట్టి సంపాయించి కడుపునిండా తిన్న రోజు కనుచూపు మేరలో లేదు. గడ్డి కొంచెం గాదం కొంచెం తినలేక చస్తున్నాం

జరిగిన గతమంతా కలగా తోస్తుంటే రాబోయే భవిత ఎంత గుదిబండ గ తోస్తుంటే, ఔరా !! మన అమ్మ నాన్నలు ఎలా పెంచారని అనిపిస్తుంది 

———————————————

మా ఫ్రెండు రాసిన ఒరిజినల్ :

ఫ్రెండు: జైశెట్టి రాధాకృష్ణ 


నలభైల్లో నిజాలు:

 

పోరాడితే పోయేదేముంది 

బానిసత్వపు సంకెళ్లు తప్ప 

పిలుపిచ్చాడు ఒక మహానుభావుడు 

స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చిందని 

సంబరాలు చేసేసుకుంటున్నాము 

స్మార్ట్ ఫోన్ లో బాటరీ అయిపోయి 

చేతిలో చార్జర్ లేనప్పుడే 

తెలిసింది ఆ బానిసత్వం

ఇంకా నన్ను విడవలేదని 😥


నలభైల్లో నిజాలు: 


భ్రమలన్నీ తొలగాక 

రంగుల స్వప్నం చెదిరాకా 

తెలిసింది అసలు స్వప్నమే లేదని 

కలే రావాలంటే .. అర్థమైంది నిద్దరోవాలని 

స్వప్నం నిజమవ్వాలంటే 

కష్ఠించాలని తెలుసు .. 

కానీ నిప్పు లాంటి ఆశయం .. 

నీలో చివరి అఖరివరకు మండాలని మరిచా !









No comments: