నిజమే !! బి.జె.పి ఎన్నో వాగ్దానాలు మరచింది ...కొన్ని పరిస్థితులు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. పెట్రోల్ , డీజిల్ ధరల పెరుగుదల ప్రజల నడ్డి విరగదీస్తున్నాయి. కానీ పెట్రోలు, డీజిలు, ధరలు అంతర్జాతీయంగా ప్రభావితం అవుతాయి...దేశీయంగా వీరి ధరలు వాదులు చెయ్యడానికి ఉన్న పరిమిత మార్గాల్లో సబ్సిడీ ఒక్కటే మార్గం. ఇంకా ఎన్ని సబ్సిడీలు? సబ్సిడీలన్నీ చివరకు పరకాల మీదనే భారం పెంచవా? సబ్సిడీలు ఇచ్చుకుంటూ పొతే, ఫిస్కల్ డెఫిసిట్ పరిస్థితి ఏంటి?
కష్టమైనా స్ట్రాటజిక్ నిర్ణయాలు తీసుకోక పొతే ఎలా ? జి.ఎస్.టి అమలు చేయకపోతే ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయం ఉండ? స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా ఇంకా ౩౦ రకాల ట్యాక్సులు అవసరమా? ఇంకా ఎన్ని రోజులు మీనా మేషాలు లెక్క పెడతారు? పర్ఫెక్టు జి.ఎస్ టి బిల్లు కోసం కాంగ్రెస్ పదేళ్లు కాలయాపన చేసింది - there is nothing called perfect . we just need to move on . ఒక్కసారి అమలు చేసాక దాన్లో లోపాలు సవరించుకోవచ్చు . అసలు అమలు చెయ్యక పొతే????!!!!
మన మిలిటరీ ఆధునీకీకరణ ఎంతో ముఖ్యమైన విషయం - కుంభకోణాల భయంతో కాంగ్రెస్ సర్కారు నిర్లిప్తంగా ఉండిపోయింది. సరియైన ఆయుధాలు లేవు, యుద్ధం వస్తే ఒక నెల రోజులకు సరిపోయేంత అమ్యునేషన్ కూడా లేదు. సైనికులకు రక్షణ కవచాలు లేవు. ఇది ఎంత భయంకర పరిస్థితి . మోడీ సర్కారు ఈ విషయాల మీద సత్వర నిర్ణయాలు తీసుకోవడం తప్పితే ప్రత్యామ్నాయం ఏమైనా వుందా??!!
“డీ- మోనెటైజేషను” ఒక తప్పు నిర్ణయము అనుకుందాం - కాని, ఎంతో సాహసోపేతంగా అమలైతే చేసారు కదా? అది ఆత్మహత్యా సదృశమైన నిర్ణయమే కదా ? దేశ రక్షణ కోసమనే కదా? కిచిడి ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలవా? దేశం కోసం ఎంతటి కఠినమైన నిర్ణయమైనా తీసుకోగలమనే చిత్తశుద్ధి ప్రదర్శించారు కదా?
ఈవీఎం , ఈవీఎం అని పితూరీలు చెప్పే ప్రతి పక్షాలు గుజరాతులో బి.జె.పి చావు తప్పి కన్ను లొట్ట పోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఈవీఎం మంచిదైపోయిందా? ఈవీఎం ల ద్వారా బి.జె.పి గెలిచేట్టయితే, కర్ణాటక లో , బీహార్ లో ఎందుకు ఓడిపోయింది?గెలుపు కోసం ఎంతటి దారుణానికైనా బి.జె.పి ఒడిగడుతుందనే ప్రతిపక్షాల మాటనిజమే అయితే, గుజరాతు రాజ్య సభ ఎలెక్షన్ లో అహ్మద్ పటేల్ ఎలా గెలిచాడు? అతన్ని బి.జె.పి
ఎలా గెలవనిచ్చింది ?ఈవీఎం లే బి.జె.పి నిజంగా విజయాలకు కారణం అయితే, అది 8 ఉప ఎన్నికలు ఎలా ఓడిపోయింది?
పాకిస్తాను తో ఎలా వ్యవహరించడం? వాళ్ళు కవ్విస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలా? మరి చేతులు ముడుచుకొని కూచోవద్దని అణు దాడులు చేయాలా? పాకిస్తానుకు బుద్ధి చెప్పాలని సర్జికల్ స్ట్రైకులు చేస్తే ప్రూఫులు అడుగుతారా? చర్చలు చర్చలు అని 70 ఏళ్ళు ఎం పీకారు?ఒక కొత్త పద్దతి ప్రయత్నిచడంలో తప్పేంటి?
కొసమెరుపు ఏంటంటే, ఇప్పటికి నాలుగేళ్లయి పొయిన్ది , ఒక్క కుంభ కోణం లేదు.. అది నిజంగా నిజమయితే, ఎంత గొప్ప విషయం? పదేళ్ల కాంగ్రెసు పాలనలో ఎన్ని వేల కోట్ల కుంభకోణాలు చూసాము?
No comments:
Post a Comment