ప్రజాస్వామ్యం గెలిచింది !! అవును !! మరి ప్రజాస్వామ్యం ఐదేళ్లు బ్రతుకుతుందా ?? ఈ ప్రశ్న ఐ.కె.గుజ్రాల్ గారిని అడగాలి; కాదు కాదు నిరంతర నిర్ణిద్రుడు దేవే గౌడ గారినే అడిగేస్తే పోలా ??
అంతెందుకు , ఘనత వహించిన కుమార స్వామి గౌడ గారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలవదు ఈ రాజకీయం ... పవర్ షేరింగ్ ఫార్ములా తో నువ్వొక రెండేళ్లు నేనొక రెండేళ్లు అని తన పదవీ కాలం ముగియంగానే బీ.జె.పి కి పంగనామాలు పెట్టిన దొర అతను.. గొప్ప “దార్శనికుడు”.. అవకాశ వాదానికి ఈ తండ్రీ కొడుకులు గొడ్డలి పెట్టు లాంటి వారు.
అన్నట్టూ, నితీష్ బాబు, గడ్డి లల్లూ గారి “మహా ఘట్బంధన్” ఏమైనట్టో ??!! బొల్లి బాబు గారు మరియు బి.జె.పి పొత్తు ఎందుకు సంక నాకిందంటారూ?
ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ? నువ్వు గెలిచావంటున్నారు, నీ చిరునామా చెప్పు కాస్త..
కాంగిరేసు దొరలూ ప్రజాస్వామ్యం అనే పదానికి ప్రత్యక్ష నిదర్శనాలు .. ఎంత ప్రజాస్వామ్యం అంటే ముఖ్యమంత్రి పీఠాలు ఎక్కడానికి హైదరాబాద్ లో మత కల్లోలాలు రేపే అంతటి ప్రజాస్వామ్యం!! ఇంకా లేక పొతే “జై తెలంగాణ” మరియు “జై ఆంధ్ర” ఉద్యమాలు పేరిట ప్రజల ఉసురు తీసే గొప్ప ప్రజా స్వామ్య వాదులు ... తమ పబ్బం గడుపుకొని, ఇవే ఉద్యమాలను తొక్కేసే పరమ ప్రజాస్వామ్యులు ...
ఇందిరమ్మ హత్యానంతరం జరిగిన సిక్కుల దమన కాండలో ప్రజాస్వామ్యం బాగా గెలిచింది. “అమ్మర్జెన్సీ”(ఎమర్జెన్సీ) లో ప్రజాస్వామ్యం గొప్పగా గెలిచింది. మొన్న మొన్నటి పది సంవత్సరాల ‘“స్కామ్”గ్రెస్‘ హయాంలో ప్రజాస్వామ్యం మహా గొప్పగా గెలిచింది..
ఆహా!! దెయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయి లా ఉంది... మంచిదే !
ఊకదంపుడు ఉపన్యాసాల మోడీ గారూ, మీ ముడ్డి కింద కుంపటి బాగా రగులుకుంది - ఉపన్యాసాలు ఆపి, చెప్పే నీతులు చేసి చూపెట్టండి.. మీకు బలం లేనప్పుడు ప్రతిపక్షం లో కూచుంటే ఏంటి మీకుపోయేది? కుమార స్వామి వారు, కాంగి రేసు దొరలూ కొట్టుకు చచ్చి ఆరు నెలల్లో మీకు అధికారం “కమలంలో” పెట్టి ఇచ్చే వారు. ఉహూ !! అహం , మేము నెగ్గాలన్న గర్వం !! పరువు ఇప్పుడు సంక నాకి పోయింది!!ఇంకా అటల్ గారి తో యెడ్డీకి సామ్యమా? సిగ్గులేదా?? మెల్ల మెల్లగా మీ లుకలుకలు బయట పడుతున్నాయి..శృంగ భంగం తప్పేట్టు లేదు ... మీ నిర్వాకం వల్ల ఏ “పప్పు “ గాడో, ఏ “బహన్” గారో, ఏ “దీదీ” గారో ప్రధానమంత్రి అయి కూర్చుంటారో ఏమో అని హడలి చస్తున్నాము.. అసలే మా “దొడ్డు ముక్కు కె. సి. ఆర్ “ సారూ తెగ కలలు కనేస్తున్నారు. మూడవ ఫ్రంటు అంట , నాటకాల్లో రెండో కృష్ణుడు లాగా.. !!
“ఆయనే ఉంటె మంగలి ఎందుకన్నట్టు” మీరు సక్కగా పరిపాలిస్తే , ఈ కుక్క మూతి పిందెలు మఖ లో పుట్టి పుబ్బ లో మాడిపోవును గదా??!!
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి !! బి. జె.పి , కాంగిరేసులు ప్రజాస్వామ్య పరిరక్షకులు ... వీరికి నిరంతర అధికార ప్రాప్తిరస్తు !!
No comments:
Post a Comment